Aarogyasri Assistance

ఆరోగ్యశ్రీ పథకం గురించి క్లుప్తంగా

 

ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని వై ఎస్ రాజశేకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు 2007 లో ఈ పథకాన్ని సమైఖ్యఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించారు . ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం అర్హులు. ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి 2 లక్షల రూపాయలు. ఇందులో ఒకవేళ కుటుంబం లో 4 గురు ఉంటె ఒకరికి జబ్బు చేసినప్పుడు 1 లక్ష 50,000 రూపాయలు ఖర్చు అయితే మిగిలిన కుటుంబానికి 50,000 వేల రూపాయలు వరకు పరిమితి ఉంటుంది,కొన్ని సార్లు ఒకరికే 2 లక్షలు అవసరమయితే మొత్తం ఇస్తారు. కానీ కొన్ని ప్రత్యేకమయిన ట్రీట్మెంట్ ల కొరకు అనగా చిన్నా తనం లోనే మూగ మరియు చెవుడు ఉన్న పిల్లలకు చేసే కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనే దానికి మాత్రం గరిష్టంగా 6 లక్షల 50000 వేల రూపాయలు చెల్లిస్తారు. ఆరోగ్యశ్రీ కింద గుండె,కిడ్నీ లివర్,ఊపిరి తిత్తులు,ఎముకలు,మెదడు ,వెన్నెముక,కాలిన గాయాలు,కాలిన గాయాలకు మానిన తరువాత చేసే ఆపరేషన్లు,కాన్సర్, చిన్న పిల్లలకు పుట్టుక తో వచ్చే సమస్యలకు ఆపరేషన్లు,ఆర్టిఫిషల్ లింబ్స్ ,రోడ్ ప్రమాదాలకు గాను మొత్తం 949 చికిత్సలకు ఉచితంగా వైద్యం చేస్తారు.
8iu67yhtgrf6yt5red (1)
* ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉన్న వారు ఆరోగ్యశ్రీ ఎంపనేల్మెంట్ ఉన్న ఆసుపత్రులయందు ఒక్క రూపాయి కూడా చెల్లించ కుండా వైద్యం పొందవచ్చు.
*ఎలాగంటే మీరు మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంటె సమీప ప్రైమరీ హెల్త్ సెంటర్ లోని ఆరోగ్యమిత్ర ద్వారా రేఫెరాల్ లెటర్ పొంది ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రికి వెళ్ళినపుడు ఆసుపత్రి లోని ఆరోగ్యమిత్ర దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆరోగ్యశ్రీ కి సంబంధించిన మెడికల్ కో ఆర్డినేటర్ ని కలిస్తే అతను రోగిని పరీక్షించి అవసరమయితే రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు .
*ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన రోగికి సంభందించిన రోగానిర్దారణ పరీక్షలను ఉచితంగానే చేస్తారు.రోగానిర్దరణ పరీక్షలకు గాను ఎటువంటి డబ్బులు
*ఒక వేళా రోగి కి ఉన్న జబ్బుకు ఆ ఆసుపత్రి లో ఎంపనేల్ మెంట్ ఉంటె వెంటనే రోగిని అడ్మిషన్ అయ్యేందుకు అంగీకరిస్తారు.
*ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా కాకుండా నేరుగా ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రి కి కూడా వెళ్ళవచ్చు .
*అలా అడ్మిట్ అయ్యిన పేషెంట్ ను తన జబ్బుకు సంభందించిన స్పెషలిస్ట్ డాక్టర్ లు చూసి రోగి జబ్బుకు సంభందించిన ఆపరేషన్ కొరకు ఆరోగ్యశ్రీ అనుమతి కొరకు ఆన్లైన్ లో అనుమతి కోరుతారు.
*ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుండి అనుమతి వఛ్చిన తరువాత నే రోగికి వైద్యం చేస్తారు.
*ఒక వేల అనుమతి నిరాకరించినట్లయితే రోగి ఆసుపత్రికి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.
*ఒకవేల రోగి కి చేయాల్సిన వైద్యం ఎమర్జెన్సీ అయితే ఆరోగ్యమిత్ర మరియు ఆసుపత్రిలోని మెడికల్ కో ఆర్డినేటర్ లేదా జబ్బుకు సంభందించిన వైద్యుడు ఫోన్ ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నందు గల మెడికల్ ఆఫీసర్ కి ఫోన్ చేసి ముందస్తు అనుమతిని తీసుకుంటారు.
*వైద్యం చేసి డిస్ఛార్జి చేసే టైం లో రోగి వఛ్చిన ప్రాంతం నుండి ఆసుపత్రికి గల r t c బస్సు టికెట్ ప్రకారం డబ్బులు చెల్లిస్తారు.
* ఇక పొతే ఆసుపత్రి లో ఉన్నన్ని రోజులు జరిగే వైద్యం కొరకు రోగి ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదు.
*ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిన తరువాత ఒక నెల లోపు ఏదయినా వైద్యం తాలూకు సమస్యలు వస్తే సదరు ఆసుపత్రి లోనే ఉచితంగానే వైద్యం చేయవలసి ఉంటుంది.
*ఒక వేళా ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన రోగిని ఎవరయినా డబ్బులు కట్టమని అంటే రోగి తరపున వారు వెళ్లి ఆరోగ్యమిత్ర కు ఫిర్యాదు చేయవచ్చు.
*ఒక వేళా రోగి వెళ్లిన ఆసుపత్రి యందు రోగి జబ్బుకు సంభందించిన సేవలు ఆ ఆసుపత్రి యందు లేకపోతె అప్పుడు ఆ మెడికల్ కో ఆర్డినేటర్ రోగిని తన జబ్బు కు సంబంధించిన ఆసుపత్రికి సిఫారసు చేస్తారు. అప్పుడు రోగి వేరే ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది.
*ఇక పొతే ఒక వేల ఆసుపత్రి లో ఆరోగ్యశ్రీ అనుబంధం లేని చికిత్సల కొరకు రోగి సదరు ఆసుపత్రి లో డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాలనుకుంటే ఆరోగ్య మిత్ర సమక్షం లో ఒక అంగీకార పత్రాన్ని రాసి ఇవ్వవలసి ఉంటుంది లేనిచో అది సదరు ఆసుపత్రి చేసిన తప్పుగా పరిగణిస్తారు.
*ఇక పొతే మొత్తం 949 చికిత్సలకు గాను 125 రకాల చికిత్సలు చేయించుకున్న వారికీ ఒక్క సంవత్సరం పాటు ఉచితంగా మందులు మరియు పరీక్షలు నిర్ధారించిన ప్యాకేజి మొత్తం లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిన పదకొండవ రోజు నుండి ఇస్తారు.
*తరువాత క్రమంగా ఉన్న చికిత్సలకు మరికొన్ని రకాల జబ్బులను అదనంగా ఆరోగ్యశ్రీ పరిధి లోకి చేర్చారు.
*కొన్ని ఆసుపత్రులు అవసరం లేకున్నా కూడా ఆపరేషన్లు చేయడం వలన 133 రకాల చికిత్సలను కేవలం గవర్నమెంట్ ఆసుపత్రులలోనే చేసే విధంగా నిభందనలు చేసారు.
*కాల క్రమేనా రాష్త్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్యసేవ గాను ,తెలంగాణా లో అదే ఆరోగ్యశ్రీ పేరు తో పతాకాన్ని అమలు చేస్తున్నారు.
*కాకపొతే ఆరోగ్యశ్రీ లో మరియు ఎన్టీఆర్ వైద్యసేవ లలో కొన్ని కొత్త జబ్బులను చేర్చారు.
*ఈ మధ్య కాలంలో రెండు పథకాలలో కూడా అవయవ మార్పిడి చికిత్సలను చేర్చారు.
*ఒకప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం కోసం వచ్చిన వారికీ సదరు ఆసుపత్రి నందు ఎటువంటి సమస్యలు ఉన్న కూడా ఆరోగ్యమిత్ర,టీం లీడర్ ,ఏరియా మేనేజర్ లాంటి వారు వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించే వారు.కానీ ఇప్పుడు అలాంటి స్పందన అయితే లేదు .
*ఈ మొత్తం సమాచారాన్ని అర్థం చేసుకో గలిగితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం కోసం వెళ్ళే వారు ఎలాంటి సమస్యలనయినా ఎవరినీ అడగకుండా వారంతట వారె పరిష్కరించుకోవచ్చు.
*ఆరోగ్యశ్రీ పథకం అనేది పేద వాడికి సంజీవని లాంటిది.చాల వరకు ఆసుపత్రులు ఈ పథకం మీద ఆదారపడి ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు.
*చాలా మంది మన దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా సరదాగా వెళ్లి కొన్ని పరీక్షలు చేయిన్చుకుందాము అనుకునే వారు కూడా చాలామందే ఉన్నారు.
*ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంబించిన మొదటి రోజు నుండి 2016 వరకు ఒక కార్పొరేట్ ఆసుపత్రి నందు ఆరోగ్యశ్రీ డిపార్టుమెంటు కు మేనేజర్ గా పని చెయ్యడం వలన చాల మంది ఇప్పటికీ నన్ను ఆరోగ్యశ్రీ రాజా గానే గుర్తు పెట్టుకున్నారు.నాకు కూడా అంత గుర్తింపు వచ్చింది.
RAJA N V G
8008488557
Call Now
Directions